అభివృద్ధి చూసే బీఆర్ఎస్ లో చేరికలు ఎమ్మెల్యే చిరుమర్తి

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 03: అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కెట్ పల్లి0 మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన అభివృద్ధి కాకుండా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడుతుందన్నారు. జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమాల పట్ల ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుస్తూ గులాబీ కండువా కప్పుకుంటున్నారన్నారు. అనంతరం పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడి పుష్పలత శంకర్, చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ కొండూరు శంకర్, పిఏసీఎస్ చైర్మన్ రెగట్టే నారాయణరెడ్డి, వార్డు సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్ లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top