నాంపల్లి రెవెన్యూ డివిజన్ చెయ్యాలని సర్పంచ్ రాజీనామా…

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 02: నాంపల్లి రెవెన్యూ డివిజన్ సాధన కొరకు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 19 రోజులకు చేరుకున్న ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ రాకపోవడంతో, సోమవారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మహాదాపురం సర్పంచ్ చంద్రారెడ్డి ఈ ప్రాంత ప్రజల మేలు కోసం చేస్తున్న ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, రెవెన్యూ డివిజన్ సాధన కోసం రాజీనామా చేస్తున్నట్టు తెలియజేశారు. రాజీనామాను లెటర్ ను అంబేద్కర్ విగ్రహానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు సెలవు దినం కావడంతో తన రాజీనామాను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి సమర్పించడం జరిగినది మంగళవారం తాసిల్దార్ కు బుధవారం ఎంపీడీవోకు గురువారం డిపిఓ, కలెక్టర్ కు తన రాజీనామా లెటర్ ను అందిస్తానని అన్నారు. నాంపల్లి మండలం చాలా వెనకబడి ఉన్నది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రెవిన్యూ డివిజన్ తో పాటు, బస్టాండ్, డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ ప్రాంత ప్రజల మేలు కోసమే నేను ఈ రాజీనామా చేస్తున్నాను అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొంత మంది బిఆర్ఎస్ సర్పంచులు రెవెన్యూ డివిజన్ సాధన కోసం రాజీనామా బాటలో నడవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదెపాక వేలాద్రి, తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, గాదెపాక సంజీవ, కురుపాటి నాగరాజు, యాదవ సంఘం మండల శాఖ కన్వీనర్ పల్నాల మల్లయ్య యాదవ్, రెడ్డి మల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top