ముందస్తు అరెస్టులతో పర్యటన కొనసాగించాల్సిన దుస్థితి బీఆర్ఎస్ పార్టీది

  • బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు చెర్కుపల్లి శాంతి కుమార్

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 02: మంత్రి కేటిఆర్ నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు చెర్కుపల్లి శాంతి కుమార్ ని సోమవారం అక్రమంగా పోలిసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా చెర్కుపల్లి శాంతి కుమార్ మాట్లాడుతూ అరెస్ట్‌లతో, బెదిరింపులతో ‌పర్యటన కొనసాగించాల్సిన దుస్థితి బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తుందని దళితులకు,3ఎకరాల భూమి, బి.సి‌బంధు, రైతు రుణామాఫీ గృహలక్ష్మి, దళిత బంధు, గ్రూప్-1 లాంటివి అమలు చేయడంలో పూర్తిగా పూర్తిగా విఫలమైందని. ఇది కేవలం శాంపుల్ సర్కార్ అని ఎద్దేవా చేశారు.బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బిఎస్పీ బలపడుతోందని బిఆర్ ఎస్ సర్కార్ భయపడి అరెస్ట్ లు చేయిస్తుందని అరెస్ట్ లతో అధికారాన్ని ఆపలేరన్నారు.ఈసారి బిఎస్పీ అధికారంలో వస్తుందన్నారు. అరెస్టు అయిన‌ వారిలో బహుజన్ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చిరుమర్తి ఆంజనేయులు‌, చెర్కుపల్లి చంద తదితరులు ఉన్నారు.

Scroll to Top