నల్లగొండ జిల్లాలో ప్లోరోసిస్ ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ ను గెలిపిస్తే మూడు గ్యారెంటీలు ఖాయం: మంత్రి కేటీఆర్
  • ఒకటో గ్యారంటీ కాంగ్రెస్ ను గెలిపిస్తే 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు వస్తది, రెండో గారంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతాడు 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు మారుతారు. మూడో గ్యారంటీ ఆకాశం నుండి పాతాళం దాకా కుంభకోణం జరుగుతుందన్నారు వారంటీ లేని పార్టీకి ఓటు వేస్తే గ్యారంటీ ఉండదని కేటీఆర్ ప్రజలకు నినాదాలు ఇచ్చారు: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
  • 1350 కోట్ల నిధులతో నల్గొండలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి… మెడికల్ కళాశాల నిర్మాణంలో ఉంది త్వరలోనే ప్రారంభం… విద్యార్థుల భవిష్యత్తు కొరకు గురుకులలో ఒక్క విద్యార్థికి 1 లక్ష 25 వేల ఖర్చు…నల్లధనం తెస్తానని చెప్పిన ప్రధాని మోదీ తెల్ల మొఖం వేసుకొని తిరుగుతున్నాడు: మంత్రి కేటీఆర్
  • నల్లగొండ జిల్లాలో ప్లోరోసిస్ ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది…ప్రజల్లో 18 గంటలకు పనిచేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: మంత్రి జగదీశ్ రెడ్డి
  • 1350 కోట్లతో నల్లగొండ పట్టణం అద్దంలా అభివృద్ధి జరుగుతుంది… 40 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 4 సంవత్సరాల్లో జరిగింది… నల్లగొండ క్లాక్ టవర్ చౌరస్తాలో నా కుడి చెయ్యి చిహ్నంగా పెట్టు నీళ్లు రప్పిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 02: అమరుల ఆశయాల వారసత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభానికి వచ్చిన ఆయనకు ఉమ్మడి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్గొండ మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ శంకుస్థాపన, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం, ఐటీ టవర్ ప్రారంభం, కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహ ప్రారంభం, చేనేత మగ్గం పథకం ప్రారంభం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభం, క్లాక్ టవర్ జంక్షన్లో కళాభారతి ఆడిటోరియం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, ఆర్ అండ్ బి డివిజన్ కార్యాలయం, సుభాష్ చంద్రబోస్ జంక్షన్, రైతు బజార్ డాక్టర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంక్షన్, ఎన్జీ కళాశాల స్ట్రీట్ వెండర్స్ లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ నల్లగొండలో ఏర్పాటు చేసిన సుందరమైన నూతన ఐటి హబ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా 1350 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఇంత అభివృద్ధి జరుగుతుండని నిలదీశారు. నల్గొండలో మెడికల్ కళాశాల నిర్మాణంలో ఉందని త్వరలోనే ప్రారంభం చేసుకుంటామన్నారు. హైదరాబాదులో రవీంద్ర భారతి కంటే పది రెట్లుగా నల్లగొండలో కళాభారతి కట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం 93 కోట్లు మంజూరు చేసిందన్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణానికి 216 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నల్లగొండలో దత్తత తీసుకుంటాం అంటే కోతలు కోసి కోతల రాయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హేళన చేశారని మండిపడ్డారు. ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండకు ఏమి చేయలేదని ఒక ఒక ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉంది నల్లగొండ ఐటి టవర్ తీసుకువచ్చి అనేక రంగాల్లో అభివృద్ధి పరిచారన్నారు. 24 గంటల కరెంటుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా అనుమానం ఉంటే మా సొంత ఖర్చులతో రవాణా ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన ఉన్న కరెంటు తీగలు పట్టుకోమ్మన్నారు. దానితో దేశానికి ఉన్న దరిద్రం కూడా పోతుంది అన్నారు. భారతదేశంలో మొత్తం 24 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద యాదాద్రి ధర్మాలు పాంట్ కడుతుంటే కాంగ్రెస్ అధికారులకు రాగానే మూసేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుర్తులేదా ప్రజలు గమనించాలన్నారు. నల్గొండలో టిఆర్ఎస్ పనితీరు చూసి ఆయన నెత్తి కరాబ్ అయింది ప్రజలు నీవెంటే ఉన్నారు నల్గొండలో బీఆర్ఎస్ ను ఆదరించి గెలిపిస్తారన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని 9 ఏళ్లలో గులాబీ జెండా చేసి చూపించిందన్నారు. ఫ్లోరోసిస్ బాధితులను అటల్ బిహారి పై ముందు పడుకోబెట్టిన బిజెపి ఫోన్ కి చెప్పిన కనికరించలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిన తరిమికొట్టి మంచినీళ్లు అందించి నల్లగొండ ప్రజలను విముక్తి కలిగించామన్నారు. రాష్ట్రంలో రైతుబంధు అమలు చేసి రైతులను ఆదుకున్నది కేసీఆర్ కాదా అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల ఆడబిడ్డల పెళ్లిలు చేసి కల్యాణ లక్ష్మి / షాది ముబారక్ తో ఆడపడుచులకు మేనమామల ముందున్నది కేసీఆర్ అన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆసుపత్రి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కొరకు గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 1 లక్ష 25 వేలు ఖర్చుతో చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రిగా ఉండి ప్రధాని మోదీ కేసీఆర్ పై అబద్దాలు చెప్పడం సరైనదేనా అని ప్రశ్నించారు. నల్లధనం తెస్తానని కథలు చెప్పిన మోడీ తెల్ల మొఖం వేసుకొని తిరుగుతున్నాడని హేళన చేశారు. మోడీ వంట గ్యాస్ ధరలు పెంచి ఆడపడుచుల మరో భావాలు దెబ్బతీశారన్నారు. మంచి పని చేసే నాయకులను ఆదరించి గెలిపించాలన్నారు. నల్గొండలో కుల మతాలకతీతంగా కలుపుకొని పోయే భూపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ను గెలిపిస్తే మూడు గ్యారెంటీలు ఖాయం 1. కాంగ్రెస్ ను గెలిపిస్తే 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు వస్తది… 2. రెండో గారంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతాడు ఐదు సంవత్సరాలకు ఐదుగురు ముఖ్యమంత్రి మారుతారు… 3. ఆకాశం నుండి పాతాళం దాకా కుంభకోణం జరుగుతుందన్నారు వారంటీ లేని పార్టీకి ఓటు వేస్తే గ్యారంటీ ఉండదన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తరిమికొట్టిన కేసీఆర్ ను కాదని ఏ పార్టీకి ప్రజలు ఓట్లేయరన్నారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లా నాశనమైందన్నారు. దేశానికే ధాన్యాన్ని అందించి నల్లగొండ అన్నపూర్ణగా పేరు పొందిందన్నారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో నిజాం కాలంలో వేసిన రోడ్లు తప్ప కాంగ్రెస్ పాలల్లో ఏ ఒక్క రోడ్డు గాని, అభివృద్ధి గాని జరగలేదని విమర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు రోజుకు 18 గంటలు పని చేస్తూ ప్రజల్లో మమేకమై పోతున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా భారతదేశానికి ఐటీ కంపెనీలో ఏర్పాటుకు హైదరాబాద్కే వచ్చి కేటీఆర్ ను కలుస్తారన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశంను పరిపాలించే సత్తా కేసీఆర్ కు కేటీఆర్ కు ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకొని కాంగ్రెస్, బిజెపి దొంగలకు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పాలన్నారు.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి 4 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ల సహకారంతో అభివృద్ధి జరిగిందన్నారు. నల్లగొండలో గులాబీ జెండాకు ఒకసారి అవకాశం ఇచ్చి గులాబీ నల్లగొండ నడిబొండున గులాబీ జెండా ఎగురవేయండి దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మాట ఇచ్చిన మాట ప్రకారం 13 వందల కోట్లతో నల్లగొండ అద్దంలో అభివృద్ధి జరిగిందన్నారు. నల్లగొండ క్లాక్ టవర్ చౌరస్తాలో నా కుడి చెయ్యి చిహ్నంగా చేసి నీళ్లు నీళ్లు రప్పిస్తున్నాను. మత్తు మైకంలో ఒక్క చేయరుతోనే ఏమైంది ఎక్కిరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ వంక చూస్తే ప్రజలు పాతాళానికి తొక్కేస్తారన్నారు. నల్లగొండలో అభివృద్ధి చేసి సీఎం కేసీఆర్ కేటీఆర్ లకు బహుమతిగా ఇస్తానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే పుట్టగతులు లేకుండా పోతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరేసుకొని మరోసారి కేసీఆర్ ను సీఎంగా చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, రామావత్ రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్లమోతు భాస్కర రావు, నోముల భగత్, ఎంపీ బడుగులు లింగయ్య యాదవ్ జడ్పీ చైర్మన్ లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీలుజ్ జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top