ఐఆర్ 20శాతానికి పెంచాలి: సైరెడ్డి లక్ష్మికాంత్ రెడ్డి

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 03: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతిని ఐదుశాతం నుండి ఇరవై శాతానికి పెంచాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్అసోసియేషన్(టి.ఎస్.పి.టి.ఎ)మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సైరెడ్డి లక్ష్మికాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐ.ఆర్ పట్ల ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు.ఐ.ఆర్ ను 20శాతానికి పెంచటంతో పాటు,ఇప్పటికే పెండింగ్ లో ఉన్న మూడు డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్మికాంత్ రెడ్డి కోరారు.

Scroll to Top