నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: యాదవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి వారికి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు .మంగళవారం మండలంలోని లింగోటం, కేతపల్లి, బండ తిమ్మాపురం, ముష్టి పెళ్లి, సుంకిశాల గ్రామాలలో రెండో విడత గొర్రెల పంపిణీ నీ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం యాదవ కురుమ సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నలగొండ వైద్యాధికారి డా. యాదగిరి, డా.విశ్వేశ్వరరావు, డా.నాగయ్య, పంగ రామ్ మోహన్ యాదవ్, కొండల్ యాదవ్, బెల్లి సత్తయ్య , రాజమల్లు నూనె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.