నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 26: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయగా. జేపీఎస్ నుండి పంచాయతీ కార్యదర్శులు గా రెగ్యులర్గా చేయబడిన ఉద్యోగులకు ఆమె రెగ్యులరైజేషన్ ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉద్యోగ సమస్యలు పరిష్కరించలేదని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలతోపాటు ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి, ఎంపీడీవో సురేష్ కుమార్, సీనియర్ పంచాయతీ కార్యదర్శులు సిలువేరు పెద్దయ్య ,అశోక్ మహమ్మద్ జావిద్ పాల్గొన్నారు