మేడిపల్లిలో ఘనంగా కాన్షీరాం జయంతి వేడుకలు…

మేడిపల్లి, ప్రజానేత్రం, మార్చి15: మాన్యశ్రీ కాన్షిరాం 90వ జయంతిని పురస్కరించుకొని మేడిపల్లి మండల కేంద్రంలో చుక్క దయానంద ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జయంతి కార్యక్రమాన్నిలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశం రాజు యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాశం రాజు యాదవ్ మాట్లాడుతూ జయంతిని పురస్కరించుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాబోయే తరాల్లో బలహీనవర్గాలు రాజ్యాధికారం ఏర్పాటు కోసం బాటలో ఏర్పాటుచేసిన మహనీయుడు కాన్సిరాం అని కొనియాడారు .నేటితరం యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలని ఈ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పంగ ప్రణయ్ బండారి సాయి పాశం సత్యం పరునంది వేంకర్ సంఘపోలు యాదగిరి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top