చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 26: చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డులో బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని శనివారం ఉదయం పర్యటించారు. వార్డులో గడప గడప తిరుగుతూ ప్రజలను కలుస్తూ, ఏనుగు గుర్తును పరిచయ చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారిన అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలు గాలికి వదిలి పెట్టారన్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వస్తారని అన్నారు.నియోజకవర్గన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఏనుగు గుర్తుకు ఓట్ వేసి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల అధ్యక్షులు గ్యార శేఖర్,కోశాధికారి మునుగోటి సత్తయ్య,మున్సిపాలిటీ అధ్యక్షులు అవిరేండి ప్రశాంత్, సినియర్ నాయకులు జిట్టా నర్సింహా రాజు,అన్నమల్ల సైదులు, భీంపాక అజయ్ బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.