మేడిపల్లి, ప్రజానేత్రం సెప్టెంబర్ 15: చికోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి నిరాకరించడం, సుమారు1000 మంది కార్యకర్తలతో పార్టీలో చేరడానికి భారీ ర్యాలీగా వెళ్లిన చికోటి ప్రవీణ్ ను బిజెపి నాయకులు అఅందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగాడు. బిజెపి నాయకులు చికోటి ప్రవీణ్ ను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ చికోటి ప్రవీణ్ కు మద్దతుగా మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సకినాల వెంకటయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులందరూ శుక్రవారం చికోటి ప్రవీణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సకినాల వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదల ఓర్వలేక కావాలనే కొందరు నాయకులు చికోటి ప్రవీణ్ పై కుట్రలు చేస్తు బిజెపిలో చేరకుండా అడ్డుపడుతున్నారని, హిందూ ధర్మం కోసం,గో సంరక్షణ కోసం కృషి చేస్తున్న నాయకుడని,సొంతంగా పార్టీ పెట్టగల సత్తా ఉన్నప్పటికీ,హిందూ ధర్మం కోసం,మోడీ పరిపాలన విధానం చూసి బిజెపిలోకి రావడానికి చికోటి ప్రవీణ్ నిశ్చయించుకున్నారని, కొందరు స్థానిక బిజెపి నాయకులు ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కుట్రలకు తెరలేపారని ఇప్పటికైనా బిజెపి కేంద్ర నాయకులు జోక్యం చేసుకొని చికోటి ప్రవీణ్‌ను తక్షణమే బేషరతుగా బీజేపీలో చేర్చుకోవాలని బిజెపి కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చికోటి ప్రవీణ్ ఒక వ్యక్తి కాదని ఆయన వెన్నుదన్నుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు, అభిమానులు చికోటి ప్రవీణ్ అండగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నామని మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కోకల ప్రకాష్ఉపాధ్యక్షుడు భువనగిరి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల వెంకన్న, కోశాధికారి ఇరుకుల రాంబాబు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు జూలూరు రాములు, సిహెచ్ వెంకటరాజ్యం, అప్పిశెట్టి రాజశేఖర్ సకినాల శ్రవణ్ కుమార్, సకినాల సాయికుమార్, సకినాల శివకుమార్, సముద్రాల శ్రీనివాస్, సముద్రాల లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.