నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 13: నాంపల్లి మండలాన్ని చండూర్ రెవిన్యూ డివిజన్లో కలుపోద్దని పాత తాలూకా కేంద్రమైన నాంపల్లి మండలాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలని నాంపల్లి తహసిల్దార్ అఖిలపక్షాల వినతి భౌతికంగా భౌగోళికంగా అన్ని వనరులు ఉన్న నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షాల డిమాండ్ చేస్తూ బుధవారం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమడలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాయిరాం, సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గాదెపాక వేలాద్రి, నాంపల్లి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దుల కోటేష్, బి.ఎస్.పి మండల అధ్యక్షుడు పల్లెటి వినోద్, డోలు దెబ్బ మండల నాయకులు పన్నాల మల్లయ్య, ముత్యాలు యాదమ్మ సైదమ్మ రాములు నరసింహ నరేష్ తదితరులు పాల్గొన్నారు.