అధ్యక్షులుగా దూడల విష్ణు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పాము నాగరాజు
బోడుప్పల్, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ న్యూ అంబేద్కర్ నగర్ కాలనీలో కాలనీ వాసుల సలహాదారులు కాలనీ పెద్దమనుషుల ఆధ్వర్యంలో ఆదివారం కాలనీ కమిటీ వేయడం జరిగింది. అధ్యక్షులుగా దూడల.విష్ణు గౌడ్,ప్రధాన కార్యదర్శిగా పాము నాగరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్ష కార్యదర్శులను కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం అధ్యక్షులు దూడల విష్ణు గౌడ్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కాలనీ సంక్షేమానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దమనుషులు,సలహాదారులు,కమిటీ సభ్యులు,యూత్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు. ముఖ్య సలహాదారులుగా ఎండి అఫ్జల్ ,గొడిశాల శ్రీనివాస్ గౌడ్, ఆదిమూలం కరుణాకర్, గోదా మల్లేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోలోజు యాదగిరి చారి,
కోశాధికారిగా దేశపాక నరసింహ, కార్యవర్గ సభ్యులు వంగల నరసింహ, ధర్మపురి అరవింద్, లక్కాకుల ప్రభాకర్,బాబురావు, ఖమ్మం పార్టీ అశోక్, కాలనీవాసులు అంబాల మచ్చ గిరి గౌడు, నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.