ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పాల్తీ తండ సమీపంలోని సుంకిశాల పంపు హౌస్ పనుల్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పంపు హౌస్ లోపల కాంక్రీట్ చేస్తుండగా దాదాపుగా 11 గంటల సమయంలో పంపు హౌస్ బండరాళ్లు కూలి కింద పనిచేస్తున్న 5 గురి కార్మికుల పై పడిపోయాయి. ఈ ఘటన వివరాలు పెద్దవూర ఎస్ఐ అజ్మీర రమేష్ వెల్లడించారు. జార్ఖంండ్ కు చెందిన, అజయ్ ఠాగూర్, రబీముడి, రాహుల్ కుమార్, కార్తీక్ మాలిక్, గత్తు మాలిక్, బికాస్ కర్మకర్ అను ఐదుగురు గత కొంత కాళంగా సుంకిశాల పంపు హౌస్ లొ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయ వీరంతా కింద కాంక్రీట్ వర్కు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు పైనుంచి బండరాళ్లు పడి వీరికి తీవ్ర గాయలయ్యాయి. వారిని వెంటనే నాగార్జున సాగర్ కమల నెహురు ఆసుపత్రికి తరలించారు. అందులో పవనపూర్ గ్రామం, ఈస్ట్ సింగ్ భూమ్ జిల్లా, జార్ఖండ్ స్టేట్ కు చెందిన బికాస్ కర్మకర్ (20)కు తలపై బలమైన గాయాలు కావడం తో మృతి చెందారు. మిగతా 4 గురిని మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్. ఆసుపత్రి కి తరలించారు. మృతుని స్నేహితుడు పవన్ సింగ్ సర్దార్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం పై దర్యాప్తు ఎస్సై తెలిపారు.