సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 2: సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంగాపురం సాయికుమార్ గౌడ్ హైదరాబాద్ నాదర్గుల్ లోని మాతృదేవో బావ అనాధ ఆశ్రమంలో ఆకలితో ఉన్న అభాగ్యులకు విశేష అన్నదానాన్ని పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా అభాగ్యులకు అన్నదానం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అభిమాని గంగపురం సాయి గౌడ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేదలకు ఎన్నో సహాయలు చేస్తూ ప్రజలలో మంచి ఆదరణ ఉన్న నాయకుడు,నటుడు అని పొగిడారు.. అలాంటి నటుడికి అభిమానిగా ఉండడం గర్వాంగా ఉందన్నారు,ఆయన సేవలోనే నడవాలని ఉద్దేశ్యం తో శనివారం రోజున అన్నదాన కార్యక్రమం ఆశ్రమంలో నిర్వహించడం జరిగిందన్నారు..ఈ కార్యక్రమంలో మాతృదేవోభవ ఆశ్రమ నిర్వహకులు గట్టు గిరి,మినుగు రఘుపతి ఆశ్రమ యువకులు పాల్గొన్నారు.