బిజేపి మండల అధ్యక్షునిగా పెంబల్ల జానయ్య…

మునుగోడు, ప్రజానేత్రం, మార్చి 10: బిజెపి మండల అధ్యక్షులను ఆ పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. దానిలో భాగంగానే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అధ్యక్షులను నియమించింది. ఆదివారం విడుదల చేసిన నియామకాల్లో బిజెపి మునుగోడు మండల అధ్యక్షులుగా చొల్లేడు గ్రామానికి చెందిన పెంబల్ల జానయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి దేశంలో మూడోసారి మోడీ ప్రధాని కావడానికి తమ వంతుగా మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తమపై నమ్మకంతో తన ఎన్నికకు సహకరించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడిమనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షమయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Scroll to Top