చిత్తూరు, ప్రజానేత్రం, ఆగస్టు 11:: జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్మన్ శైలజ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం మరింత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.