నాంపల్లి, ప్రజానేత్రం ఆగస్టు 18: మండలంలోని జాన్ తండ గ్రామపంచాయతీకి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సపవత్ రాంకోటి అనారోగ్యతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదోడ్ల రవీందర్ రెడ్డి వారి కుటుంబానికి అండగా నిలబడి. మృతిని కుటుంబానికి రూ.10 వేలు పంపించగా మండల బిఆర్ఎస్ ఎస్టి సెల్ అధ్యక్షుడు సపవత్ సర్దార్ శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, బాషా, జబ్రూ కొట్య, శ్రీను, లచ్చిరాం, శంకర్, శ్రీను, రవి, నరేష్, మేగవత్ యాదగిరి, హరిసింగ్ తదితరులు ఉన్నారు.