కలెక్టర్ ఉత్తర్వులను పాటించని ఉపాధ్యాయురాలు: ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 16: అక్రమ సర్దుబాటును రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బుదవారం నాంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గట్లమల్లేపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలును వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ప్రాథమిక పాఠశాల పసునూరుకు కేటాయించడం జరిగింది. కానీ ఆ ఉపాధ్యాయురాలు ఎలాంటి సమాచారం లేకుండా వేములపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి ఉత్తర్వులను లెక్కచేయకుండా అక్రమ డిప్యూటేషన్లో ఉన్న ఉపాధ్యాయురాలని వెంటనే తిరిగి పాఠశాలకు రప్పించాలని లేనిచో ఉపాధ్యాయురాలి వేతనాన్ని నిలుపుదల చేసి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సహకరించిన మండల విద్యాధికారి గురువారావు పై కూడా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గేర నరసింహ మండల అధ్యక్షులు సిలువేరు నారాయణ ప్రధాన కార్యదర్శి జంపాల అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు పున్న కృష్ణయ్య, కొండమీది కృష్ణవేణి మరియు సంఘ సభ్యులు మెహతాబ్ గని ,రజియుద్దిన్ , విజయభాస్కర్, నరేష్, విజయ భాస్కర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top