బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా…

చిట్యాల, ప్రజానేత్రం, మార్చి 22: ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దని, అందరికీ వెన్నంటుగా ఉండి, అండగా ఉంటానని బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి మేడి ప్రియదర్శిని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్స్ మునుగోటి సత్తయ్య, చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండలం అధ్యక్షులు జోగు శేఖర్, రామన్నపేట మండల ఉపాధ్యక్షులుగుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ, మండల కోశాధికారి గట్టు రమేష్,మండల మహిళా కన్వీనర్,బందెల అనిత, నాయకులు బాలాగోని మల్లయ్య గౌడ్,బుస్సు శ్రీకాంత్,రవి,యోగి, రామ్ కుమార్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top