మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 22: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాడవాడల గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ డివిజన్లోని ఐఐసిటి కాలనీ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి- ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి “అన్నదాన” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని,విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, కోరుకున్నానని, అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డివిజన్ ప్రజలకు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో 5వ డివిజన్లోని వివిధ కాలనీల అధ్యక్ష,కార్యదర్శులు, కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.