- పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 05: నా వ్యక్తిగత స్వార్థం కొరకు సిద్ధాంతాలను మార్చుకునే వ్యక్తిని కాదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు నేను బిజెపిని వీడుతున్నట్లు వస్తున్న సోషల్ మీడియాలో వార్తలు వాస్తవం కాదని చెప్పారు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించానని చెప్పారు. సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయని ఆవేదన చెందారు. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రా ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోడీ అమిత్ షా కి ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశానని, నేనే కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరు బిజెపిని వీడరుని తేల్చి చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతామన్నారు.